Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రాకు ఒక ఫైనాన్సియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో అతనిపై షెర్లిన్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక వీడియో రికార్డింగ్ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. వీడియో రికార్డింగ్ కు తాను ఒప్పుకున్నానని, కానీ అనివార్య కారణాల వల్ల వీడియో షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నానని, తాను తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించేందుకు కూడా ఒప్పుకున్నానని చెప్పింది. అయినప్పటికీ తనను బెదిరిస్తున్నాడని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో సల్మాన్ ఖాన్ పై కూడా షెర్లిన్ విమర్శలు గుప్పించింది. మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్ ఖాన్ ను బిగ్ బాస్ రియాల్టీ షోకు పెట్టుకోవడంతో సల్మాన్ ను ఆమె విమర్శించారు.