Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పట్నా
తూర్పు చంపారణ్ జిల్లాలోని మోతిహరి ప్రాంతంలో కల్తీ మద్యం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాయి. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కల్తీ మద్యాన్ని ఓ ట్యాంకర్లో తీసుకొచ్చి స్థానిక వ్యాపారులకు విక్రయించారని, ఆ తర్వాత మరణాలు చోటుచేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకూ స్పందించలేదు. మరోవైపు దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక అధికారుల నుంచి నివేదిక కోరినట్లు తెలిపారు.