Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దుబాయ్
దుబాయ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిలో నలుగురు భారతీయులతో సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మందికి తీవ్ర గాయలయ్యాయి. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటన. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా ఈ అగ్నిప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోయారు. వీరు భవనంలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఓ బిల్డింగ్ లో ఫోర్త్ ప్లోర్ లో స్థానికలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.36 గంటలకు మంటలు చెలరేగినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఆపరేషన్స్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి మధ్యాహ్నం 2.42 గంటలకు మంటల్ని ఆర్పగలిగారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచాన వేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.