Authorization
Tue April 29, 2025 06:54:24 pm
నవతెలంగాణ - బెంగళూరు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ రాలేదనే అసంతృప్తితో ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరుతున్నారు. ఈ తరుణంలో తాజాగా బీజేపీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు.
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీశ్ శెట్టర్ హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఈసారి కూడా టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం యువ నాయకులకు అవకాశం ఇవ్వాలని ఈయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఉత్తర కర్ణాటకలో బీజేపీ 20-25 సీట్లు కోల్పోతుందని ఈయన ఇప్పటికే హెచ్చరించారు. అయినా అధిష్ఠానం మాత్రం టికెట్ కేటాయించలేదు.