Authorization
Wed April 30, 2025 12:43:34 am
నవతెలంగాణ - అమరావతి
ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఏప్రిల్ 3న ప్రారంభం అయిన పరీక్షలు నేడు ముగిశాయి. ఈ సారి పరీక్షలు ఆరు పేపర్లుగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 6.11 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ పరీక్షల కోసం ఏపీ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి పరీక్షలు సజావుగా పూర్తిచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు. పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.