Authorization
Wed April 30, 2025 04:03:55 am
నవతెలంగాణ - ముంబై: కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించిన సిద్దేశ్వర్ మాలి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో కారు నడుపుతున్న ఆదిత్య ఆపకుండా మరింత వేగంతో దూసుకుపోయాడు. దీంతో కానిస్టేబుల్ తన బైక్పై కారును వెంబడించి సమీప క్రాస్ రోడ్డులో ఆపేందుకు ప్రయత్నించగా అతడిని ఢీకొట్టడంతో కారు అద్దంపై పడిపోయాడు. అయినా కారును ఆపకుండా అలాగే పది కిలోమీటర్లు వెళ్లాడు ఆదిత్య. దీంతో పోలీసులు మరో వాహనంలో వెంబడించి కారును ఆపి కానిస్టేబుల్ను కాపాడారు. ఆదిత్య ఈ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.