Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట్ర: శివమ్ దూబే గొప్ప క్రికెటర్గా ఎదుగుతున్నాడంటే తన తండ్రి చేసిన త్యాగం అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. అతని ప్రస్తుతం వయసు 25 ఏళ్లు మాత్రమే. అతను భారత్ తరఫున కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు, కానీ జట్టులో స్థిరమైన స్థానాన్ని సంపాదించడంలో విఫలమయ్యాడు. అతను భారత్ తరపున ఒక వన్డే, 13 టీ20 మ్యాచ్లలో వరుసగా 9 మరియు 105 పరుగులు చేశాడు. కొడుకు క్రికెటర్ కావాలని చిన్నతనంలోనే తన తండ్రి కలలు కన్నాడని దూబే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. శివమ్కి శిక్షణ ఇచ్చే బాధ్యతను తన భుజంపై వేసుకుని రోజూ గంటల తరబడి ప్రాక్టీస్ చేసేలా చేశాడు. అతను సుమారు 10 సంవత్సరాల పాటు సాధన చేశాడు. 14 సంవత్సరాల వయస్సు నుండి, శివమ్ ముంబైలోని కోచ్ చంద్రకాంత్ పండిట్ వద్ద కోచింగ్ తీసుకున్నాడు. శివం తండ్రి జీన్స్ వ్యాపారం చేసేవాడు. కొడుకును క్రికెటర్గా మార్చేందుకు తన తండ్రి వ్యాపారాన్ని కూడా అమ్మేశారని శివమ్ చెప్పాడు.