Authorization
Wed April 30, 2025 07:03:58 am
నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగం ఇద్దరి ప్రాణాలను తీసింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ట్యాంకర్ బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను భార్యభర్తలుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన పాపను గమనించిన స్థానికులు తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.