Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. గొప్ప చరిత్ర కలిగిన ప్రదేశమని.. రామాయణం రాసిన వాల్మీకిది వరంగల్ ప్రాంతమేనని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. వాల్మీకికి గొప్ప గుర్తింపు తీసుకు వచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే దేవాలయాల అభివృద్ధి చేస్తోందన్నారు. బమ్మెర పోతన పుట్టిన ప్రదేశం ఇది బమ్మెర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
రామప్పకు యునెస్కోకు గుర్తింపు వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని.. కేంద్రం ఇప్పటికైనా గుర్తించి నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. 22 అడుగుల వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. బమ్మెర పోతన స్వగ్రామం బమ్మెరలో కళ్యాణ మండపం, హరిత హోటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురాతన ఆలయాలను చారిత్రాత్మకమైన ప్రదేశాలను వందల కోట్లు సీఎం కేసీఆర్ ఖర్చు చేస్తున్నారన్నారు. కేంద్రం అవార్డులు ఇస్తుంది కానీ నిధులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో వెయ్యి గ్రామాలకు అవార్డులు రాబోతున్నాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.