Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. నాలుగు మ్యాచుల్లో విఫలమైన కామెరూన్ గ్రీన్(64) అర్ధ శతకంతో చెలరేగాడు. దాంతో, ముంబై 192 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్(38), తిలక్ వర్మ(37) సిక్స్‌లతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు, భువనేశ్వర్, నటరాజన్ తలా ఒక వికెట్ తీశారు. టాస్ ఓడిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్(38) ధాటిగా ఇన్నింగ్స్ మొదలెట్టారు. దంచికొడుతున్నరోహిత్ను ఔట్ చేసి నటరాజన్ హైదరాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇషాన్, గ్రీన్ ఆచితూచి ఆడారు. జాన్సెన్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్(7)ను ఔట్ చేసి ముంబైని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(37) సిక్స్‌లతో చెలరేగాడు. నటరాజన్ బౌలింగ్‌లో గ్రీన్ హ్యాట్రిక్ ఫోర్లు బాది యాభై పూర్తి చేసుకున్నాడు. టిమ్ డేవిడ్(16) ఆఖర్లో ధాటిగా ఆడడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది.