Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అఖిల్ హీరోగా రూపొందిన 'ఏజెంట్' సినిమా ఈ నెల 28వ తేదీన థియేటర్లకు రానుంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను 'కాకినాడ'లో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై అఖిల్ మాట్లాడుతూ .. 'ఎయిర్ పోర్టు నుంచి మీరిచ్చిన ఎనర్జీ, ఈ సినిమా రిలీజ్ వరకూ నన్ను ఎంతో ఉత్సాహంగా ఉంచుతుంది. ఈ సినిమాతో రెండేళ్ల పాటు జర్నీ చేశాను. ఈ సినిమా వలన నేను ఫిజికల్ గానే కాదు .. మెంటల్ గా కూడా మారాను. నాకు సినిమా అంటే ఎంత పిచ్చి .. ఫ్యాన్స్ అంటే ఎంత పిచ్చి అనేది నాకు ఇంకా అర్థమైంది' అని అన్నాడు.
నేను ఇక్కడే ఉంటాను .. ఫ్యాన్స్ కోసమే పనిచేస్తుంటాను. ఇలాంటి ఒక అవకాశం .. అదృష్టం ఎంతమందికి వస్తుంది? మీ ప్రేమాభిమానాలను ఎప్పటికీ నా గుండెల్లో దాచుకుంటాను.న ఈ జర్నీలో నేను చెప్పే ఫస్టు పేరు .. లాస్ట్ పేరు సురేందర్ రెడ్డి గారిదే. ఇక అనిల్ సుంకర గారు ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంతా చేశారు. సాక్షి వైద్య కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పుకొచ్చాడు.