Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త. గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాలా.. వద్దా? అన్నట్టుగా ఉన్నాయి. పెరిగితేనేమో రూ.500 పైన పెరుగుతోంది. తగ్గితేనేమో కేవలం రూ.10 ఇలా తగ్గుతోంది. నేడు కూడా బంగారం ధర తులంపై రూ.10 తగ్గింది. దీనిని అసలు తగ్గినట్టుగా పరిగణలోకి తీసుకోవడం కంటే స్థిరంగా ఉంది అనుకోవడం మేలు. నేడు దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,840లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 60,910గా ఉంది. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. నేడు కిలో వెండి ధర రూ.77,400 వద్ద కొనసాగుతోంది.