Authorization
Tue April 29, 2025 09:00:43 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం వాయవ్య తెలంగాణ, గురువారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది.
ఈ తరుణంలో బుధవారం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41- 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య గురువారం పలు చోట్ల 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 21వ తేదీ నుంచి 4, 5 రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. బుధవారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో గరిష్ఠంగా 43, 44 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, జీహెచ్ఎంసీ పరిధిలో 21వ తేదీ నుంచి 35-37 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.