Authorization
Wed April 30, 2025 04:44:02 am
నవతెలంగాణ - ఢిల్లీ
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు వ్యవహారంలో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా సుప్రీంలో సునీత దాఖలు చేసిన పిటిషన్ అంశాన్ని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఎదుట ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.