Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జనవరిలో నిర్వహించిన ఆగమశాస్త్ర అర్చక పండితుల పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టుల నియామకం కోసం దేవాదాయ శాఖ గతేడాది నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వగా డిసెంబర్ 20వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ఐదో తరగతి/తత్సమాన విద్యార్హత కలిగి ఉండటంతో పాటు 16 ఏళ్లు నిండి 40 ఏళ్లు మించని అభ్యర్థులను అర్హులుగా నిర్ణయించారు. అయితే, ఈ ఏడాది జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించారు. ఆగమశాస్త్ర అర్చక పండితుల పరీక్షల్లో 2,556మంది పాసైనట్టు వెల్లడించారు