Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీల పై సమీక్షించాం. త్వరలో బదిలీల పై నిర్ణయం తీసుకుంటాం. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. దీనికోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నామని మంత్రి తెలిపారు.