Authorization
Tue April 29, 2025 09:14:23 pm
నవతెలంగాణ - రాజస్థాన్
అల్వార్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొట్టగానే మరణించిన ఆవు ఎగిరి వృద్ధుడిపై పడటంతో అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. రైలు పట్టాల వెంబడి ఓ పశువుల మంద మేస్తున్నది. అదే సమయంలో ఓ వృద్ధుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి మూత్ర విసర్జన చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే వందే భారత్ రైలు కూతపెడుతూ అటుగా వస్తున్నది. ఇది గమనించని ఓ ఆవు పట్టాలు దాటే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. మరణించిన వృద్ధుడు శివదయాల్ శర్మ (82)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు అతడిని వెంటనే అల్వార్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.