Authorization
Wed April 30, 2025 05:44:19 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలోని కూకట్పల్లి రైతుబజార్లో ఏర్పాటు చేసిన ఏటీబీ(ఎనీ టైమ్ బ్యాగ్) మెషీన్ను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, మూసాపేట సర్కిల్ డీసీ రవికుమార్ పాల్గొన్నారు. మార్కెట్కు వచ్చే కొనుగోలుదారులు10 రూపాయల నోట్ పెడితే, ఏటీబీ ఒక కాటన్ బ్యాగ్ ఇస్తుంది. ఇటీవల బాలానగర్లో ఏర్పాటు చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కూకట్పల్లిలో ఏర్పాటు చేశారు.