Authorization
Tue April 29, 2025 05:05:46 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో స్వామివారి ధర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. లక్ష్మీనరసింహ స్వామివారి ధర్మదర్శనానికి 2 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. యాదగిరి గుట్టను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయడంతో యాదాద్రి పుణ్యకేత్రాన్ని చూసేందుకు భక్తులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అయితే భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు. కాగా, కొండపైకి వెళ్లే బస్సు సర్వీసులు సరిపోవట్లేదని భక్తులు ఆందోళన చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల సిబ్బందితో భక్తలు వాగ్వాదానికి దిగినట్లు సమాచారం.