Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు తమ్మినేని లేఖ
నవతెలంగాణ హైదరాబాద్: ఐకేపీ వీవోఏల సమస్యలను తక్షణమే పరిష్కరించి.. వారి సమ్మె విరమింపజేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. గత 20 ఏండ్లుగా రాష్ట్ర వ్యాపితంగా పనిచేస్తున్న 17,608 వీరికి ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు, ప్రమోషన్లతో పాటు, సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం లేవని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. వీటి సాధనకోసం రాష్ట్ర వ్యాపితంగా ఐకేపీ వీఓఏలు చాలా కాలంగా పలు నిరసన కార్యక్రమాలు చేసినా, ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో గత ఆరు రోజులుగా మండల కేంద్రాల్లో నిరవధిక సమ్మెకు పూనుకున్నారని తెలిపారు.
ఐకేపీ వీఓఏలు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తూ, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అవగాహన కల్పిస్తున్నారు. సభ్యులకు లోన్లు ఇప్పించి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. డ్వాక్రా సంఘాల లావాదేవీలన్నీ రికార్డు చేస్తూ ఎస్హెచ్ఐ లైవ్ మీటింగ్ పెట్టి ఆన్లైలో ఎంట్రీ చేస్తున్నారు. సంఘాల పనులే కాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అమలయ్యేలా వీరు కృషి చేస్తున్నారు. అయినా వీరికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నుండి కేవలం రూ.3900లు మాత్రమే గౌరవవేతనం ఇస్తూ చేతులు దులుపుకుంటున్నదని విమర్శించారు. గ్రామసంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతినెలా వీఏవోల వ్యక్తిగత ఖాతాల్లోకి కనీస వేతనం రు.26వేలు చెల్లించాలని, వీరిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి, గుర్తింపు కార్డులివ్వాలివ్వడంతో పాటు, ఉద్యోగ భద్రత కల్పించాలని, రు.10లక్షల సాధారణ మరియు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, జాబ్ చార్టర్‌తో సంబంధం లేని ఆన్లైన్ పనులను వీరితో చేయించొద్దని, వీరిపైన పైన మహిళా సంఘాల ఒత్తిడి లేకుండా ఎస్‌హెచ్‌జీలకు వీఎల్ఆర్, అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోషన్ కల్పించాలని ఐకేపీ వీవోఏలు కోరుతున్నారు. వెంటనే వీరి న్యాయమైన డిమాండ్ల పట్ల మీరు సానుకూలంగా స్పందించి, ఐకేపీ వీవోఏలకు న్యాయం చేయాలని తమ్మినేని లేఖలో కోరారు.