Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. కృనాల్ పాండ్యా వేసిన రెండో ఓవర్లోనే శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఇదే క్రమంలో వృద్ధిమాన్ సాహా(47), అభినవ్ మనోహర్(03), విజయ్ శంకర్ (10) కూడా వెనుతిరిగారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ముగిసే సరికి రవి బిష్ణోయ్ వేసిన ఆరో ఓవర్లో సాహా రెండు ఫోర్లు కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. దీంతో 10 ఓవర్లకు గుజరాత్ నాలుగు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. హార్ధిక్ పాండ్యా(41), డెవిడ్ మిల్లర్ (02) క్రీజులో ఉన్నారు.