Authorization
Tue April 29, 2025 04:21:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ చలనచిత్ర నటుడు శరత్‌బాబు(71) ఆరోగ్యం విషమంగా ఉంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈనెల 20న హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ)లో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. శరీరం మొత్తం విషతుల్యం (సెప్సిస్) కావడంతో ఆ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం ఇతర అవయవాలపై పడినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపాయి.