Authorization
Tue April 29, 2025 11:46:30 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కేరళలోని ఇడుక్కి - కొచ్చి జాతీయ రహదారిలో టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో తమిళనాడుకు చెందిన చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. 16మంది గాయపడ్డారు. తిరునెల్వేలి నుంచి 20 మందితో కేరళ రాష్ట్రం మూనారు పర్యాటక ప్రాంతానికి బయలు దేరిన టూరిస్టు బస్సు పొట్టిమేడు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో తిరునల్వేలికి చెందిన వళ్లియమ్మాల్(70), పెరుమాళ్ (50), చిన్నారి ప్రమాద స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. 16మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.