Authorization
Fri May 02, 2025 12:47:29 pm
నవతెలంగాణ - సంగారెడ్డి: తెలంగాణలోని మంజీరా నది గురుడగంగ కుంభమేళ ప్రారంభమయింది. మంజీరా నదిలో పుష్కరుడు ప్రవేశించడంతో కుంభమేళాను నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలం పంచవటి క్షేత్రం ఆవరణలో గరుడగంగ కుంభమేళాను ప్రారంభించారు. పంచవటి క్షేత్రం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహనంతో కుంభమేళ ప్రారంభమయింది. కాసేపట్లో అంటే ఉదయం 11 గంటల నుంచి మంజీరా నదిలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించడం ప్రారంభమవుతుంది. కుంభమేళ నేపథ్యంలో ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహిస్తారు. ఉత్తరాది నుంచి నాగా సాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు కూడా కుంభమేళాకు తరలిరానున్నారు.