Authorization
Thu May 01, 2025 01:29:05 am
నవతెలంగాణ - హైదరాబాద్: మే, జూన్ నెలలకు సంబంధించిన రూ.300 శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి http//tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్చేసుకోవాలని అధికారులు భక్తులకు సూచించారు. టీటీడీ మొబైల్ యాప్ ttdevasthanamsను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు. నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.