Authorization
Fri May 02, 2025 12:01:01 am
నవతెలంగాణ - రుద్రప్రయాగ్
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని నేడు ఉదయం 6.20 నిమిషాలకు తెరిచారు. వేదోచ్ఛరణ మధ్య ఆలయ ద్వారాలను ప్రధాన పూజారి జగద్గురు రావల్ బీమా శంకర్ లింగ శివాచార్య ఓపెన్ చేశారు. సోమవారమే కేదార్నాథ్ ఆలయానికి ఉత్సవ మూర్తిని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గత 72 గంటల నుంచి కేదార్నాథ్ పరిసర ప్రాంతాల్లో భీకరంగా మంచు కురిసింది. బాబా కేదార్ దర్శనం కోసం ఇవాళ సుమారు 8 వేల మంది వేచి ఉన్నట్లు తెలుస్తోంది.
కేదారీశ్వరుడి ఆలయం ఓపెనింగ్ సందర్భంగా .. ఆలయాన్ని పువ్వులతో ముస్తాబు చేశారు. సుమారు 20 క్వింటాళ్ల పువ్వులతో ఆలయాన్ని అలంకరించారు. ఇవాళ టెంపుల్ను తెరవనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అక్కడ మైనస్ ఆరు డిగ్రీల టెంపరేచర్ ఉంది. అయినా వేలాది మంది దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి ఆలయ ద్వారాల ముందు భక్తులు క్యూకట్టారు.