Authorization
Tue April 29, 2025 10:44:02 am
నవతెలంగాణ - చండీగఢ్
పంజాబ్ మాజీ సీఎం, శిరోమణి అకాళీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్ (95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. బుధవారం ప్రకాశ్ సింగ్ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించనున్నట్లు ఆయన తనయుడు తెలిపారు.
ప్రకాశ్ సింగ్ బాదల్ 1927, డిసెంబరు 8న పంజాబ్‌లోని అబుల్ ఖురానా గ్రామంలో జన్మించారు. బాదల్ కు కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, కుమార్తె ప్రణీత్ కౌర్. 30 ఏళ్ల వయసులో 1957లోనే తొలిసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 43 ఏళ్ల వయసుకే ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ 5 సార్లు పంజాబ్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగానూ రికార్డు సృష్టించారు.