Authorization
Tue April 29, 2025 11:05:50 am
నవతెలంగాణ - హైదరాబాద్
రాజధాని హైదరాబాద్‌ను అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీల్లోని ఇండ్లలోకి నీరుచేరింది. పలుచోట్ల రోడ్లపైకి నీరుచేరడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
ఈ తరుణంలో రహమత్ నగర్లో విషాదం చోటుచేసుకున్నది. ఓ ఇల్లు గోడకూలడంతో 8 నెలల చిన్నారి మృతిచెందింది. మంగళవారం అర్థరాత్రి సమయంలో రహమత్‌నగర్‌లోని ఓ రేకుల షెడ్డుపై పక్కనే ఉన్న ఇంటి గోడ కూలిపోయింది. రేకుల షెడ్డులో నిద్రిస్తున్న దంపతులు, చిన్నారిపై గోడపడిపోయింది. దీంతో చిన్నారి మరణించగా, దంపతులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.