Authorization
Tue April 29, 2025 09:37:12 pm
నవతెలంగాణ - ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆదిలాబాద్, జైనాథ్, తాంసీ, తలమడుగు, బేల మండలాలతోపాటు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. ఉదయం నుంచి నిరాటంకంగా కురుస్తున్న వర్షం వల్ల అక్కడక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా వ్యవసాయ పనులకు ఆటకం ఏర్పడింది.