Authorization
Tue April 29, 2025 02:58:22 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి (డీఐజీ)తో కలిసి నూతనంగా నిర్మించిన పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించి, ఈ సందర్భంగా కమిషనర్ ఛాంబర్, అడిషనల్ డీసీసీల చాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్, గ్రీవెన్స్ సెల్ హాల్, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్స్, మీటింగ్ హాల్, రిసెప్షన్ కౌంటర్, కమిషనర్ కార్యాలయ వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది రూమ్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా దామోదర్ గుప్తా మాట్లాడుతూ 28 ఎకరాల స్థలంలో రూ.38.50కోట్ల వ్యయంతో అధునాతన హంగులతో పోలీసు కమిషనరేట్ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు.