Authorization
Wed April 30, 2025 01:49:56 am
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్లో ఈనెల 9 మధ్యాహ్నం 12.12 గంటలకు అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆ సమయంలో నీడ మాయం కానుంది. ఇలా జరగడాన్ని ‘జీరో షాడో డే’ అంటారు. ఆ సమయంలో హైదరాబాద్లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయి. అప్పుడు ఎండలో నిటారుగా (90 డిగ్రీల కోణం) ఉంచిన వస్తువుల నీడ రెండు నిమిషాల పాటు అంటే 12.12 గంటల నుంచి 12.14 గంటల వరకు కనిపించదని బీఎం బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారులు తెలిపారు.
ఆ సమయంలో ఎండలో మనం నిల్చున్నా ఆ నీడ కనిపించదని పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 3న కూడా హైదరాబాద్లో ‘జీరో షాడో డే’ ఏర్పడుతుందని తెలిపారు. సమయంలో మార్పుల వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ జీరో షా డే వస్తుందన్నారు. కాగా, ఇటీవల బెంగళూరులోనూ ఈ ఖగోళ అద్భుతం కనిపించింది. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 12.17 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషుల నీడ మాయమైంది.