Authorization
Wed April 30, 2025 06:21:47 am
నవతెలంగాణ - జయశంకర్ భూపాలపల్లి: సబ్బండ వర్గాలు కొంగు బంగారంగా కొలిచే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2024 ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో మహాజాతర నిర్వహించాలని పూజారులు నిర్ణయించారు. బుధవారం ములుగు జిల్లా మేడారంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. రెండేళ్లకోసారి మాఘ పౌర్ణమికి సమీప బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతరను నిర్వహించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతోపాటు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించాలని పూజారుల సంఘం నాయకులు కోరారు.