Authorization
Fri May 16, 2025 05:03:36 pm
నవతెలంగాణ - చెన్నై: రాష్ట్రంలో గురువారం ప్రారంభమైన అగ్ని నక్షత్రం ఈ నెల 29వ తేది వరకు కొనసాగనుంది. అయినప్పటికీ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తుండగా, ఈ నెల 12వ తేది నుంచి వర్షాలు తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాతావరణ పరిశోధన కేంద్రం గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 6న ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, దాని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడి మరుసటిరోజు వాయుగుండంగాను, 9న తుఫానుగా బలపడనుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 11వ తేది వరకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాగా, 12వ తేది నుంచి రాష్ట్రంలో మళ్లీ ఎండలు అధికమవుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది.