Authorization
Fri May 02, 2025 12:01:50 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఎన్సీపీ చీఫ్ పదవికి శరద్ పవార్ రాజీనామా చేసి రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా కోరుతున్నారు. కొత్త చీఫ్ ఎంపికపై ఏర్పాటైన కమిటీ కూడా.. శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. పార్టీని ఆయనే నడిపించాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పింది.
ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. తన నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని శరద్ పవార్ ను ఆయన కోరారు. శుక్రవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల చుట్టూ జాతీయ రాజకీయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. దేశంలో లౌకిక కూటమిని బలోపేతం చేయడంలో కీలకమైన శరద్ పవార్.. ఎన్సీపీ చీఫ్ పదవి విషయంలో మరోసారి ఆలోచించాలి. ఎన్సీపీకి తిరిగి నాయకత్వం వహించాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.