Authorization
Wed April 30, 2025 11:18:16 am
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు అలర్ట్. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం సుమారుగా రేపు, మే 06వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మే 07వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 08న వాయుగుండం గా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత, దాదాపు ఉత్తరం దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపుకి కదులుతూ తీవ్రతరం అయ్యి తుఫాన్ గా బలపడే అవకాశం ఉంది. ఈ తుఫాన్ యొక్క తీవ్రత, ప్రయాణించే మార్గం మొదలగు వివరములు అల్పపీడనంగా మారిన తరువాత లభించును. దీని ప్రభావం వలన తెలంగాణ రాష్ట్రములో 8వ తేదీ నుండి పొడి వాతావరణం ఏర్పడి రాష్ట్రములో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలు కన్నా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది.