Authorization
Wed April 30, 2025 11:39:38 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల పరిధిలో తాటిపాముల గ్రామానికి చెందిన గంధం కురుమన్న ముగ్గురు కుమార్తెలు గంధం తిరుపతమ్మ (16) గంధం సంధ్య (12) గంధం దీపిక (10) తాటిపాముల గ్రామంలోని వీరసముద్రం చెరువుకు సోమవారం రోజున బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు ఒకరి తర్వాత మరోకరు చెరువు గుంతలోకి జారి మరణించారు. ఈ ముగ్గురు ఓకే కుటుంబానికి చెందిన అక్కచెల్లెళ్లు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి సంఘటన జరగడం పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపాన్ని, తెలియజేశారు ఈ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి అన్నారు. చిన్నారుల మృతి నన్ను తీవ్రంగా కలచివేసిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సంఘటన గ్రామప్రజలకు అందరికీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని,దయచేసి తల్లిదండ్రులు ఎండాకాలంలో పిల్లలు ఇంటిదగ్గర వుంటారు కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని,చెరువులు, కుంటల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కోరారు.