Authorization
Tue April 29, 2025 12:59:17 pm
నవతెలంగాణ - అమరావతి : శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్ద పనసలో దారుణం జరిగింది. ఓ జంటను అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారుణంగా కత్తితో దాడి చేసి చంపి కలకలం సృష్టించాడు. కోదండ పనస గ్రామానికి చెందిన ఎర్రమ్మ(40), సంతోష్(25) పొలం వద్ద పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి కత్తితో దాడి చేసి చంపాడు. అయితే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు నరసన్నపేట సీఐ రాము తెలిపారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.