Authorization
Tue April 29, 2025 02:05:13 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కుడి తొడకు విజయవంతంగా సర్జరీ ముగిసింది. మంగళవారం ఆ శస్త్ర చికిత్స చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అతను ఓ పోస్టు చేశాడు. చాలా స్మూత్‌గా, ఎటువంటి ఇబ్బందిలేకుండా సర్జరీ చేసిన డాక్టర్లకు అతను థ్యాంక్స్ తెలిపాడు. ఐపీఎల్లో లక్నోకు ఆడుతున్న రాహుల్.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ సమయంలో గాయపడ్డాడు. అయితే గాయపడ్డ రాహుల్‌ను ఐపీఎల్ నుంచి దూరం పెట్టిన విషయం తెలిసిందే. ఇక జూన్‌లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌కు కూడా అతను దూరం అయ్యాడు. సర్జరీ పూర్తి చేసుకున్న రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకోనున్నాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.