Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల బుధవారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేడి వాతావరణం ఉండగా.. సాయంత్రానికి చల్లబడి భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, నాచారం, మల్లాపూర్, ఘట్ కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రహదారులు చెరువులను తలపించడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీల్లో ముంచెత్తిన వరదనీటితో ప్రజలు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉప్పల్ కూడలి నుంచి వరంగల్ ప్రధాన రహదారిపై భారీగా వరదనీరు వచ్చి చేరడంతో రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు. ఘట్ కేసర్-కీసర మార్గంలో చెట్లు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.