Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. గత నెల 30వ తేదీన బీటెక్ రవిపై చక్రాయపేట పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. ఓ స్థలం వివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు 32 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బీటెక్ రవి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.