Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీబీఎస్ఈ 10, 12 తరగతుల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వేళ సామాజిక మాధ్యమాల్లో నకిలీ సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ నెల 11న (గురువారం) సీబీఎస్ఈ ఫలితాలు విడుదల కాబోతున్నాయంటూ బోర్డు డైరెక్టర్ జోసెఫ్ ఇమ్మాన్యుయేల్ సంతకంతో ఓ నోటీసు సర్క్యులేట్ అవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫలితాల విడుదలపై అలాంటి లెటర్ ఏమీ తాము విడుదల చేయలేదని స్పష్టంచేశారు. ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డు ఫ్యాక్ట్‌చెక్ పేరిట ఓ ట్వీట్ చేసింది. అయితే, సీబీఎస్ఈ ఫలితాలను ఎప్పుడు విడుదల చేసేది మాత్రం వెల్లడించలేదు.