Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. భూ వివాదం కారణంగా ఓ వ్యక్తి సర్జికల్ బ్లేడుతో ప్రత్యర్థులపై దాడికి తెగబడ్డాడు. మల్పూర్ గ్రామంలో ఈ ఘటన ఇవ్వాల (బుధవారం) సాయంత్రం జరిగింది. సర్జికల్ బ్లేడుతో దాడి చేయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.