Authorization
Wed April 30, 2025 08:18:15 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్లు) రూ.265 తగ్గి రూ.61,585 పలికింది. మంగళవారం ట్రేడింగ్లో తులం బంగారం ధర రూ.61,850 వద్ద ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 2033 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆసియా మార్కెట్లలోనూ తక్కువ ధర పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.120 పెరిగి రూ.77,800 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 25.88 డాలర్లకు చేరుకున్నది.