Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము గెలిచే అవకాశమున్న 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీకి గట్టి దెబ్బ తగలనుందని అయినప్పటికీ ఈ ఎన్నికల్లో తాము కింగ్ కానున్నామని జేడీఎస్ నాయకుడు హెచ్ డీ కుమారస్వామి అన్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ తన పార్టీ గెలిచిన సీట్ల సంఖ్యపరంగా కాంగ్రెస్, బీజేపీల కంటే ముందంజలో ఉంటుందన్నారు. ఎందుకంటే తన పార్టీ కేవలం కింగ్ మేకర్ మాత్రమే కాదని, కింగ్ అన్నారు. తనకు బాధ కలిగించే విషయం ఏమిటంటే తాను తన అభ్యర్థులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల పరంగా పక్కన పెడితే తాము ప్రజల మద్దతు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. గెలిచిన అభ్యర్థులు ఉన్న అనేక నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపురలో మాదిరిగా చివరి దశలో అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమయ్యామన్నారు. తాము 120 సీట్లు గెలవకపోయినప్పటికీ తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు.