Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. రూ.కోటి 30 లక్షల విలువ చేసే 2 కేజీలకుపై బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి చెన్నై వెళుతున్న ప్రయాణికుడి వద్ద బంగారం గుర్తించారు. బంగారాన్ని దుబాయ్ ప్రయాణికుడు హైదరాబాద్లో అప్పగించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ జరుపుతున్నారు.