Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఢిల్లీ పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చాన్నాళ్లుగా ఢిల్లీ సర్కార్, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. ఈ కేసులో 2019 నాటి సింగిల్ జడ్జీ తీర్పుతో ఏకీభవించడం లేదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు లేవన్న విషయాన్ని తాము అంగీకరించబోమన్నది. ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీ మధ్య జరిగిన వివాదంపై జస్టిస్ అశోక్ భూషణ్ 2019లో తీర్పును వెలువరించారు. అయితే ఆ తీర్పును తాము అంగీకరించడం లేదని ఇవాళ సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కింది. అధికారులను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్లు సుప్రీం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా వ్యవహారలను కేంద్ర సర్కార్ టేకోవర్ చేసుకోరాదు అని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది.