Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లలో అస్థిరత కారణంగా మార్కెట్లు నష్టపోయాయి. గురువారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 35.68 క్షీణించి 61,904.52 పాయింట్లకు చేరింది. నిఫ్టీ 18.10 పాయింట్లు తగ్గి 18,297.00 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇవాళ ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. ఉదయం సెన్సెక్స్ 62,158.10 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలై ఇంట్రాడేలో 62,168.22 పాయింట్ల గరిష్ఠాన్ని తాకి.. చివరకు 61,904.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,357.80 దగ్గర వద్ద మొదలై.. ఇంట్రాడేలో 18,389.70 గరిష్ఠాన్ని తాకి చివరకు చివరకు 18.10 పాయింట్ల నష్టపోయి 18,297 దగ్గర స్థిరపడింది.