Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్న కర్ణాటక ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీని ప్రజలు సాగనంపి సెక్యులర్ ప్రభుత్వానికి పట్టం కడతారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నాటక పోరులో బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. బిహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీష్ కుమార్తో గురువారం ముంబైలో శరద్ పవార్ భేటీ అయిన అనంతరం ఇరువురు నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో నెలకొన్న పరిస్ధితిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విపక్షాలు ఏకతాటిపైకి రావడం కీలకమని పవార్ స్పష్టం చేశారు. విపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే దేశం కోరుకుంటున్న ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుకు తీసుకురాగలుగుతామని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. విపక్షాలు ఏకమైతే దేశ ప్రయోజనాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పలు రాజకీయ పార్టీలతో తాము సంప్రదింపులు జరిపామని, మరోసారి తాము కలిసి ఈ దిశగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని నితీష్ కుమార్ పేర్కొన్నారు. పవార్ తమ పార్టీ కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని తాను కోరినట్టు తెలిపారు. ఇక నితీష్ అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రేను ముంబైలోని మాతోశ్రీలో కలిశారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు నితీష్ గత కొద్దిరోజులుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.