Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఏ3 నిందితురాలు రేణుక బెయిల్ పైన విడుదలయింది. నాంపల్లి కోర్టు బుధవారం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పూచీకత్తు సమర్పించడంతో విడుదల కాస్త ఆలస్యమైంది. గురువారం రేణుక తరఫు న్యాయవాదులు పూచీకత్తు సమర్పించడంతో కోర్టు బెయిల్ కాపీలను జారీ చేసింది. బెయిల్ ఆర్డర్ కాపీ అందడంతో జైలు అధికారులు రేణుకను విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రేణుకను పోలీసులు రెండు నెలల క్రితం అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు పలువురు నిందితులు అరెస్టయ్యారు. నాటి నుండి చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. రేణుక అనారోగ్యం పాలు కావడం, మహిళ కావడం, దర్యాఫ్తు చివరి దశలో ఉండటంతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఆమెకు బెయిల్ మంజూరయింది.