Authorization
Wed April 30, 2025 04:29:22 am
నవతెలంగాణ - బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(సెక్యులర్) లెక్కలు వేసుకుంటున్నది. 2018 ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకూడదని ప్రతి పార్టీ కోరుకుంటున్నది. జేడీ(ఎస్) అగ్ర నేత కుమార స్వామి సింగపూర్ నుంచి కౌంటింగ్ రోజు బెంగళూరుకు రానున్నారు. ఎన్నికల ఫలితాలను బట్టి తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేస్తామని జేడీ(ఎస్) అగ్ర నాయకుడు ఒకరు వెల్లడించారు. కాంగ్రెస్ కర్ణాటక ఇన్చార్జి సూర్జేవాలా కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు.